అదిలాబాద్ అర్బన్: శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో విజయదశమి వేడుకలు: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ
విజయదశమిని పురస్కరించుకొని అశోక్ రోడ్డులోని శ్రీ కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.