ఎడ్ల పోటీల ద్వారా ఒంగోలు జాతి పశు సంపదను, రైతులను ప్రోత్సహించడం అభినందనీయం: మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | May 10, 2026
రాజసానికి, పౌరుషానికి మారుపేరుగా నిలిచి భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఒంగోలు జాతి గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం మద్దిపాడు మండలం దొడ్డవరం లో జరిగిన జాతీయస్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన ఎడ్ల పోటీలకు మంత్రి స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..... మన ప్రాంతంలో పుట్టిన ఒంగోలు జాతి గిత్తలు మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేలు జాతిగా గుర్తింపు పొంది మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందన్నారు.