దర్శి: ముండ్లమూరులోని మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే నిర్వహించిన :!వైద్య అధికారులు సీహెచ్ ప్రవీణ్ కుమార
Darsi, Prakasam | May 14, 2025 ముండ్లమూరులోని మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే ను బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్య అధికారులు సీహెచ్ ప్రవీణ్ కుమార్, బి.మధు శంకర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు గ్రామీణ ప్రాంత ప్రజలకు చేస్తున్న వైద్య సేవలు ఎంతో అమోఘమని, అదేవిధంగా చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలని సూచించారు. టీకాలు చిన్నారుల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఏఎన్ఎంలు పాల్గొన్నారు.