కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం చలో అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ సంఘాల జేఏసీ తెలిపింది. శుక్రవారం హిమాయత్నగర్ ఏఐటీయుసీలో జేఏసీ సమావేశం జరిగింది. జేఏసీ ఛైర్మన్ బి.వెంకటేశం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు.