అనంతపురం జిల్లా కేంద్రంలోని చలమారెడ్డి ఫంక్షన్ హాల్ నందు బలిజ కాపు నాడు మహా సంఘం జిల్లా అధ్యక్షులు తాడాలా నాగభూషణం అధ్యక్షతన ఆదివారం కాపునాడు మహా సంఘం రాయలసీమ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అర్జా రామకృష్ణ, యువ కాపునాడు అధ్యక్షులు పూల చైతన్య మోహన్ తదితరులు రాష్ట్ర నలుమూలల కాపునాడు రాష్ట్ర కార్యనిర్వాహక నాయకులతో కలిసి పాల్గొన్నారు. సమైక్యతతో సమస్యలను సాధించుకుందామని విజయవాడలో నవంబర్ 30న జరిగే కాపునాడు స్వర్ణోత్సవంలో పాల్గొని సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.