ఎల్లారెడ్డి: ప్రపంచ బ్యాంకును 100 కోట్ల విపత్తు సహాయo కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
వరల్డ్ బ్యాంక్ నుండి 100కోట్ల విపత్తు సహాయo ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరినట్లు గురువారం ఎమ్మెల్యే క్యాంపు నుండి విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. గత 100ఏళ్లలో కానీ విని ఎరగని రీతిలో ఇటీవల ఎల్లారెడ్డి సెగ్మెంట్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసాయి. ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ(జి ఎఫ్ డీ ఆర్ ఆర్ )కు విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా నష్టపోయిన పంటలకు తక్షణ సహాయం, కూలిన, ఇళ్ల పునర్నిర్మాణం, పేద, బలహీన వర్గాలకు సహాయం.