కోడుమూరు: వర్కూరు వద్ద ఉల్లి పొలాలను పరిశీలించిన సీపీఎం బృందం, రైతులను ఆదుకోవాలని డిమాండ్
కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామం వద్ద ఉల్లి దిగుబడులను సోమవారం సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పొలాల్లోకి వెళ్లి రైతులనడిగి పెట్టుబడి ఖర్చులు, గిటుబాటు ధరలపై తెలుసుకున్నారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడారు. ఉల్లి రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని వెంటనే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎగుమతులకు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గఫూర్మియా, రాజు పాల్గొన్నారు.