సీఎం పర్యటనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిన్నమండెం పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో చిన్నమండెంలోని ఏఆర్ కల్యాణ మండపంలో మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది.ఎస్పీ గారు అధికారులు, సిబ్బందికి పర్యటన సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూట్ మ్యాప్, కాన్వాయ్ మార్గం, హెలిప్యాడ్, ప్రజావేదిక ప్రాంతాల్లో భద్రతా చర్యలు పకడ్బందీగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. సీఎం భద్రతా బృందంతో కలిసి ఎస్పీ గారు స్వయంగా ఏర్పాట్లను పరిశీలి