శంకర్పల్లి: శంకర్పల్లి IFCAI లో విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవం: డైరెక్టర్ విశ్వనాథ్
చేవెళ్ల సర్కిల్ పరిధిలోని శంకర్పల్లిలో IFCAI యూనివర్సిటీలో లేఖ్య అనే విద్యార్థినిపై యాసిడ్ దాడి అవాస్తవమని, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని, ఫేక్ వార్తలు సర్కులేట్ అవుతున్నాయని వెల్లడించిన డైరెక్టర్ విశ్వనాధ్. సీసీటీవీ పొట్టి సైతం చెక్ చేసామని, అలాంటిది ఏదీ జరగలేదని తెలిపారు. మరి లేఖ్య జరిగిన గాయాలు బహుశా వేడినీళ్ల వల్ల జరిగే ఉండవచ్చని ఆయన వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ సహా పూర్తి వివరాలను క్లూస్ టీంకు అందించామని ఆయన తెలిపారు.