రాజమండ్రి సిటీ: బొమ్మూరులో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరాహార దీక్ష
బొమ్మూరు లోని 220kv సబ్స్టేషన్ వద్ద విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం శుక్రవారం రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపుమేరకు ట్రాన్స్కో జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలను జేఏసీ చైర్మన్ జగత అచ్యుతరామయ్య, కన్వీనర్ రవికుమార్ ప్రారంభించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు.