పెద్దఅడిశర్లపల్లి: నాగార్జునసాగర్ ఎడమ కాలువ 17, 42 మైలురాళ్ల వద్ద ఎస్కేప్ ఛానల్స్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పలువురు ఇరిగేషన్ అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్ ఎడమ కాలువ 17, 42 మైలురాళ్ల వద్ద ఎస్కేప్ ఛానల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర సమయాల్లో సాగునీటిని నియంత్రించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి నీటిని వెంటనే ఎస్కే చానల్స్ ద్వారా స్ట్రీమ్ కు విడుదల చేయడానికి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.