బనగానపల్లె: కొలిమిగుండ్లలో వైసీపీ కార్యకర్త మృతి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన వైసిపి సోషల్ మీడియా కార్యకర్త రవీంద్రనాథ్ గౌడ్ ఈనెల 13వ తేదీన అనారోగ్యంతో మృతిచెందాడు ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు వీరి వెంట స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు