ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు
ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా తాళ్లరేవుకు చెందిన దంగేటి మహేష్ బాబు (రెండు సెట్లు నామినేషన్స్ ) ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థిగా ఐ పోలవరం మండలం మురమళ్ళకు చెందిన దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు (రెండు సెట్లు నామినేషన్స్) నామినేషన్ వేశారు. ముమ్మిడివరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.