అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని సన్ రైజర్స్ పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన బాలల దినోత్సవం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం ఈ ఓ-2 హరికృష్ణ పాల్గొని కరస్పాండెంట్ మారిన ఉపాధ్యాయులతో కలిసి చాచా నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ఆటల పోటీలలో ప్రతిభను చూపిన వారికి బహుమతులను ఎం ఈ ఓ అందజేశారు.