ఒంగోలు సుజాతనగర్ లో తప్పిపోయి తిరుగుతున్న చిన్నారి, తమ సంరక్షణలో ఉంచిన తాలూకా పోలీసులు
Ongole Urban, Prakasam | May 11, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని సుజాతనగర్ లో సోమవారం తప్పిపోయి తిరుగుతున్న చిన్నారిని పోలీసులు తమ సంరక్షణలో ఉంచారు. పాప తన పేరు ప్రణవి అని తన నాన్న పేరు గిరి అని చెబుతున్నట్లు ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపారు. ఎవరన్నా ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తిస్తే చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని అలానే చిన్నారి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు.