పాణ్యం: పగిడ్యాల మండలం సంకిరేణిపల్లెలో తీవ్ర విషాదం, పిడుగుపాటుకు గొర్రెల కాపరి రాముడు మృతి
కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం సంకిరేణిపల్లెలో పిడుగు పడి గొర్రెల కాపరి మృతి చెందాడు. గొర్రెలు మేపడానికి వెళ్లిన కాపరి వడ్డే రాముడు (60) పిడుగు పడటంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు నందికొట్కూరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రాముడు కుటుంబం పేద కుటుంబం అని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. రాముడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.