ఆర్ కృష్ణాపురం గ్రామంలో, ఆస్తికోసం అన్నను కడతేర్చిన తమ్ముడు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఆస్తికోసం సొంత అన్ననే తమ్ముడు కడతేర్చాడు, ఆర్ కృష్ణాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఏసేబుకు ఐదుగురు కుమారులు, ఆస్తి పంపకాలపై తరచూ అన్నదమ్ములు గొడవ పడేవారు, ఈ క్రమంలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో అన్న దైవ భక్తుడును తమ్ముడు విజయ రాజు రోకలిబండతో మోది హత్య చేశాడు, అడ్డుకోబోయిన మరో ఇద్దరు అన్న దమ్ములనూ గాయపరిచాడు, మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు