కె వి బి పురం 108 లో ఈఎంటి గా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఉద్యోగిని వి రేవతి కుటుంబ సభ్యులకు గురువారం 108 యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ రూ 66,500 ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందజేశారు. తొలుత రేవతి చిత్రపటానికి పూలమాలలు వేసి యూనియన్ సభ్యులు నివాళులర్పించారు. రేవతి మృతి చెందిన రోజున వారి కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చులకు గాను ఉద్యోగుల సంఘం నుంచి 10000 వేల రూపాయలు, యాజమాన్యం నుంచి 15000 వేల రూపాయలు అందించిన్నట్లు బల్లి కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం రేవతి ఉత్తరక్రియలు నిర్వహించిన సందర్భంగా తిరుపతి జిల్లా ఉద్యోగులు అందరూ మృతురాలి ఇద్దరు పిల్లల పేరు