బేతంచర్ల లో జీవనోపాధికి వచ్చిన కూలి గుండెపోటుతో మృతి
Dhone, Nandyal | May 20, 2026 బేతంచెర్లకు జీవనోపాధి కోసం వచ్చిన కార్మికుడు గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. ప్యాపిలికి చెందిన ఉల్లి వీరాంజనేయులు(39) బేతంచెర్లకు కూలీ పనుల కోసం వచ్చాడు. పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పడిపోవడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసి వైద్య సేవలను అందించారు. అప్పటికే వీరాంజనేయులు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.