పల్స్ పోలీయో నిర్వహనపై జిల్లా కలెక్టరేట్లో టాస్క్ ఫోర్స్ కమిటీతో సమావేశం నిర్వహించిన DMHO దుర్గారావు దొర
చిన్నారుల్లో అంగవైకల్యం వారి తల్లిదండ్రులకు శాపంగా మారకుండా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో పల్స్ పోలియో నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 3,4,5, తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ తీరును వివరించారు.