నంద్యాల అర్బన్: మే 31న నంద్యాలలో" సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన" పదవ వార్షికోత్సవ మహాసభ
Nandyal Urban, Nandyal | May 26, 2026
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అనేక ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఈనెల 31న నంద్యాల శివారులోని చాబోలు మెట్ట సమీపంలోని ఏ ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన పదవ వార్షికోత్సవ మహాసభ నిర్వహిస్తున్నట్లు సమితి నాయకులు మంగళవారం ప్రకటించారు. నంద్యాల పట్టణంలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 2016 మే 31న జరిగిన సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ఉద్యమానికి సంబంధించిన వీడియోను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు