సంతనూతలపాడు నుండి ఒంగోలు వైపుకు వెళ్ళు రహదారిపై ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కొండచిలువ రహదారి పైకి వచ్చింది. కొండచిలువ రహదారిపైకి రావడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయి ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. కొద్దిసేపటి తరువాత కొండచిలువ రహదారి పక్కనే ఉన్న గుట్టల్లోకి వెళ్లిపోవడంతో నిలిచిపోయిన వాహనాలు ముందుకు సాగాయి.