ఒంగోలు అర్బన్: శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 1, 2026
శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెలరోజులపాటు నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం స్థానిక మినీ స్టేడియంలో ఆయన ప్రారంభించారు. వివిధ విభాగాలలో విద్యార్థుల ప్రదర్శనను కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడ వెనుక ఒక శాస్త్రీయ దృక్పథం ఉందన్నారు. అందుకే క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దపేట వేస్తున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలకు కూడా