నిజామాబాద్ సౌత్: ఆర్టీసీ యాత్ర దానం పథకం పోస్టులను ఆవిష్కరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ సేవలను నిరంతరం అందిస్తోంది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన 'యాత్రా దానం' పథకంలో భాగంగా దాతలు,వర్తకులు, నాయకులు తమ తమ వారిని లేదా అనాధ, అభాగ్యులకు 'యత్రదానం' పథకం ద్వార వివిధ ప్రాంతాలకు సందర్శించే అవకాశం కల్పించవచ్చు. ఇందుకు గాను వివిధ రకాల బస్సులను సరసమైన రేట్లతో ప్రతిపాదించింది.ఈ కార్యక్రమం పోస్టర్లను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రముంలో టీజిఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ టి. జోస్నా, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ పాల్గొన్నారు.