చిత్తూరు అర్బన్: తిరుమలకు ట్రక్కును బహుకరించిన అశోక్ లేలాండ్ ప్రతినిధులు, పూజ కార్యక్రమం అనంతరం స్వీకరించిన టిటిడి అధికారులు
Chittoor Urban, Chittoor | Jun 13, 2026
ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ ట్రక్కు తాళాలను అందజేశారు. టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ జీఎం లక్ష్మీప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.