అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో అనేక గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఇవ్వడం జరిగిందని వాటిని పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు అర్జీలను పంపించి వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని భవిష్యత్తులో ప్రజల సమస్యల పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.