నిర్మాణంలో ఆగిపోయిన బాపట్ల మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించాలి: మాజీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి
నిర్మాణంలో ఆగిపోయిన బాపట్ల మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మెడికల్ కాలేజీని సందర్శించి మీడియాతో మాట్లాడారు. పేదవాడికి అవసరమైన మెడికల్ కాలేజీ నిర్మాణం ఎందుకు చేయలేకపోతున్నావని చంద్రబాబుపై కోన నిప్పులు చెరిగారు. 4 వేల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయలేవా అని ప్రశ్నించారు.