నంద్యాల అర్బన్: బండి ఆత్మకూరు మండలం లో పేలిన గ్యాస్ సిలిండర్, భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
Nandyal Urban, Nandyal | Aug 2, 2026
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం చిన్నదేవలాపురంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సుబ్బారాయుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలింది. సుబ్బారాయుడితో పాటు ఆయన భార్య నాగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.