ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ హైవే పై ప్రైవేట్ ట్రావెల్ బస్సు: బొగ్గుల లారీని ఢీకొట్టడంతో ఒకరి మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని కడప హైవే రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు, 30 మంది ప్రయాణికులతో అరుణాచలం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ట్రావెల్ బస్సు బొగ్గు లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొనడంతో చిత్తూరు జిల్లా సుగంకు చెందిన సుబ్రహ్మణ్యం అనే ప్రయాణికుడు మృతి చెందాడు, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు