తిరుపతి జిల్లా సూళ్లూరుపేట - అక్కంపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ మగ వ్యక్తి మృతదేహాన్ని శ్రద్ధ సేతు ఎక్స్ప్రెస్ లోకో పైలట్ సోమవారం గుర్తించారు. ఈ సమాచారాన్ని వెంటనే సులూరుపేట జిఆర్పిఓపి ఆర్ పి హెచ్ సి శ్రీనివాసులుకు తెలియజేశారు. లోకో పైలట్ సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని శ్రీనివాసరావు పరిశీలించారు. మృతుని చేతిపై L + R అనే పచ్చబొట్టు మినహా మరేమీ ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. సమాచారం తెలిసినవారు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.