నిర్మల్: అడెల్లి గ్రామంలో శ్రీ మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని ఆలయ ఛైర్మన్‌కు విన్నవించిన భక్తులు
Nirmal, Nirmal | Jul 6, 2025 సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి గ్రామంలో గల శ్రీ మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని కోరుతూ కౌట్ల (బి) గ్రామానికి చెందిన అమ్మవారి భక్తులు ఆదివారం ఆలయ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. 2022 అక్టోబర్ లో అమ్మవారి ఆలయ పునః ప్రతిష్టాపన పనుల ప్రారంభించి నిర్మాణం పూర్తయిందని అన్నారు వచ్చే సెప్టెంబర్ నెలలో గంగనీళ్ల జాతర ఉంటుందని, ప్రతిష్టాపన వేడుకలు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఇందులో రాజారెడ్డి గంగారెడ్డి సాయిబాబా తదితరులున్నారు.