నందికోట్కూరు: ఈవ్ టీజింగ్,ర్యాగింగ్ చేస్తే చర్యలునంది కళాశాల'విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన పట్టణ సీఐ
బాలికలపై ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు పట్టణ సీఐ ఎం అశోక్ కుమార్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నంది జూనియర్ కళాశాలలో విద్యార్థులకు'శక్తి యాప్' మరియు మహిళా చట్టాల గురించి అవగాహన సదస్సు మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ బద్ధుల శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది.పట్టణ సీఐ అశోక్ కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళలకు, బాల బాలికలకు ప్రత్యేకంగా ప్రభుత్వం శక్తి యాప్ తీసుకువచ్చిందని ప్రతి విద్యార్థినీలు తప్పనిసరిగా ఈ శక్తి యాప్ ను 7993485111 వాట్సాప్ నంబర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని ఎవరైనా సరే అమ్మాయిలను ఈవ్ టీజ