నందికోట్కూరు: విలేకరిపై దాడి దుర్మార్గపు చర్య : మహర్షి వాల్మీకి బోయ సంఘం ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పాత్రికేయుడు స్వామన్నపై దాడి దుర్మార్గపు చర్య అని మహర్షి వాల్మీకి బోయ సంఘం ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు పేర్కొన్నారు, శుక్రవారం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న స్వామన్నను పరామర్శించారు, అనంతరం మహర్షి వాల్మీకి బోయ సంఘం ఏపీ రాష్ట్ర నిర్వాహక అధ్యక్షులు గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు మాట్లాడుతూ మార్చి 31న నందికొట్కూరులో విలేకరి స్వామన్న పై జరిగిన కిరాతక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్య తీసుకోవాలని అన్నారు