ఒంగోలు అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జన్మదిన వేడుకలు
Ongole Urban, Prakasam | Jun 22, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు చేరువగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఘన విజయం సాధించిన విజయకు శుభాకాంక్షలు తెలిపారు తక్కువ కాలంలో పేదల కోసం ఎక్కువ సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత అతనికి దక్కుతుందన్నారు దేవాలయాలు పాఠశాలల సమీపంలో మద్యం అమ్మకాలను ఆపిన ఘనత అతనిదేనన్నారు పేద ప్రజల చదువు కోసం ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని పేదల మనసుల్లో కొలువయ్యాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదా సుధాకర్ స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు