సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాబూజీ సేవలు చిరస్మరణీయం, వర్ధంతి సందర్భంగా నివాళులు
తెలంగాణ ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాబుజీ సేవలు చిరస్మరణీయమని యువజన వికాస్ సమితి నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని బాబుజి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీలో యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి చేసిన సేవలను కొనియాడారు. 1969లో తెలంగాణ కోసం తన పదవిని తృణపాయంగా వదిలిన వ్యక్తి, 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు.