ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుంది: వైసిపి విద్యార్థి విభాగం నాయకులు
Ongole Urban, Prakasam | May 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫలితాలపై పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం శుక్రవారం ఒంగోలు నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. దాదాపు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. ప్రభుత్వం కనీసం మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించలేదన్నారు