అన్నమయ్య జిల్లాలో డ్రోన్ పర్యవేక్షణతో నేరాలకు చెక్
అన్నమయ్య జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పర్యవేక్షణ ప్రారంభించింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ సూచనల ప్రకారం, పట్టణాలు, శివారుల ప్రాంతాలు, నేర ప్రోణ్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు.పోలీసులు పేకాట, గంజాయి, బహిరంగ మద్యం సేవ, రోడ్డు రవాణా ఉల్లంఘనలు, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై సమాచారం కోసం ప్రజలు డయల్ 112 లేదా 1972 నంబర్లకు కాల్ చేయవచ్చును. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.