వలేటివారిపాలెం: ఉపాధి హామీ పనులపై ఎంపిటిసి చింతలపూడి రవీంద్ర వ్యాఖ్యలు...
వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెం ఎంపీటీసీ చింతలపూడి రవీంద్ర శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో భాగంగా చేసిన పనులను మరల చేయించడంతో నిధులు వృధా అవుతున్నాయని ఆరోపించారు. రీసర్వే సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి చెన్నకేశవులు, ఎంపీడీవో నరేంద్రదేవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది.