విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి - జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ
Ongole Urban, Prakasam | Jul 11, 2025
విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చుచేస్తుందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ పేర్కొన్నారు. నాగులుప్పలపాడు మండలం, అమ్మనబ్రోలు గ్రామంలో గల సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని, ఆంద్రప్రదేశ్ గురుకుల బాలికల విద్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ ఆకస్మిక తనిఖీ చేసారు. ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి రిజిస్టార్ ను పరిశీలించారు.