బనగానపల్లె: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి
చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇల్లూరు కొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో నియోజకవర్గ టాపర్ గా నిలిచిన సాయి చేతన్ (590)కు ఆయన రూ.50,000 నగదు బహుమతి అందజేశారు.అలాగే వివిధ పాఠశాలల్లో ప్రథమ స్థానాలు సాధించిన 56 మంది విద్యార్థులకు తలా రూ.5,000 పంపిణీ చేశారు.