ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దొడ్డంపల్లి గ్రామంలో గత నెల 23వ తేదీన రమణారెడ్డి అనే వ్యక్తి ఇంటిలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలను శుక్రవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పి నాగరాజు మీడియాలో వెల్లడించిన వివరాల మేరకు చెడు అలవాట్లకు బానిసైనా దొంగలు రమణారెడ్డి ఇంట్లో 90 గ్రా. బంగారాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. కారులో వచ్చి నిందితులు చోరీకి పాల్పడ్డారని నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు దొంగిలించిన బంగారాన్ని దొంగతనానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి మీడియాకు వెల్లడించారు.