చెన్నూరు: జైపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం రాత్రి పాల్గొన్నారు. ఈ మేరకు మండలంలోని సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను సూచించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.