గుంతకల్లు: గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు, రూ.1,850 జరిమానా విధించిన సీఐ రామారావు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీఐ రామారావు ఆధ్వర్యంలో సోమవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. గుత్తి అర్ఎస్, పత్తికొండ వైపునకు వెళ్తున్న బైక్, ఆటో, బొలెరో, కార్లను ఆపి రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ రికార్డులు పరిశీలించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలకు రూ.1,850 రూపాయలు జరిమానా విధించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ద్విచక్రవాహన దారులకు సూచించారు. అదే విధంగా కార్లలో తనిఖీలు చేశారు.