బనగానపల్లె: ఈనెల 9న బనగానపల్లెకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏర్పాటను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, ఎస్పీ
సీఎం చంద్రబాబు బనగానపల్లెలో ఈ నెల 9న పర్యటించనున్నారు. అదే రోజు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కర్నూలు రహదారిపై అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షౌరాణ్ పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. t 62 చదవని వార్తలు