డోన్: సాగుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి: . బేతంచెర్ల లో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ
Dhone, Nandyal | Jun 4, 2026 సాగుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను నంద్యాల జేసీ సూరజ్ ధనుంజయ ఆదేశించారు. బేతంచెర్ల మండల రైతులతో జిల్లాస్థాయి సంప్రదింపుల సమావేశం గురువారం నిర్వహించారు. రైతులు సాగునీరు, ఎరువులు, విత్తనాల లభ్యత, పంటల కొనుగోలు వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కార చర్యలు చేపడతామని ఆయన అన్నారు. రైతులు ఆధునిక సాగు విధానాలను అవలంభించాలని సూచించారు.