పటాన్చెరు: వర్షాల వరదలో వావిలాల పీర్ష చెరువు అందాలు
గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని వావిలాల గ్రామం పీర్ష చెరువు సోమవారం మత్తడి దూకుతోంది. గత రాత్రి కురిసిన భారీ వర్ష ప్రభావంతో చెరువు నిండిపోవడంతో మత్తడి నుంచి నీరు ఎగసిపడుతోంది. ప్రస్తుతం చెరువు పరిసరాలు జలకళతో అలరారుతున్నాయి. స్థానికులు, పర్యాటకులు మత్తడి దృశ్యాన్ని వీక్షించేందుకు తరలివస్తున్నారు. చెరువు నిండడంతో స్థానిక రైతంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.