ఒంగోలు అర్బన్: ఒంగోలులో జంటకు కులం అంతర వివాహం జరిపించిన దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం
Ongole Urban, Prakasam | Jul 6, 2026
ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో కులంంతర వివాహం జరిగింది. సోమవారం దళిత పోరాట హక్కుల సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ కులంతర వివాహం జరిగింది. కాకినాడకు చెందిన గంగాభవానికి మార్కాపురం జిల్లా కనిగిరి కి చెందిన రాహుల్ కి వివాహం జరిపించారు. భీమవరం కాలేజీలో డి ఫార్మసీ చదువుతున్న ఇరువురు ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇరువురు ఒంగోలులో నీలం నాగేంద్ర ని ఆశ్రయించారు. జంటకు వివాహం జరిపించడమే కాకుండా వారికి రక్షణ కల్పించాలని కలెక్టర్ రాజబాబును కలిసి వారు విన్నత పత్రాన్ని సమర్పించారు. నూతన జంటను ఆశీర్వదించి చల్లగా ఉండాలని వారు జంటను కోరారు.