అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల్లో గురువారం క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని బెలుగుప్ప కూడేరు వజ్రకరూర్ ఉరవకొండ విడపనకల్లు మండలాల్లోని గ్రామాల్లో క్రైస్తవులు తమ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పండుగగా జరుపుకున్నారు. బెలుకుప్ప మండల కేంద్రంలోని చర్చి నందు టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా చర్చలను విద్యుత్ దీప కాంతుల అలంకరించారు. చర్చిల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.