అనంతపురం అర్బన్: కాంక్రీట్ కలిపే మిషన్ లో ప్రమాదవశాత్తు చెయ్యి పడి కార్మికురాలికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామంలో ప్రమాదవశాత్తు కాంక్రీట్ కలిపే మిషన్ లో చేయి పడడంతో సుకన్య అనే మహిళా కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె చేయి పూర్తిగా మారడంతో ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.