అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కోనాపురంలో కార్తికేయ ఎంటర్ప్రైజెస్ స్టోరేజ్ పాయింట్ లో పేలుడు పదార్థాలు చోరీ చేసిన కేసును పోలీసులు 24 గంటలలో చేధించారు. చోరీకి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించి బుధవారం పెద్దవడుగూరు పోలీసుస్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులు వివరాలను వెల్లడించారు. స్టోరేజ్ పాయింట్ యజమాని శ్యామ్ కిరణ్ డ్రైవరే ఈ చోరికి పాల్పడినట్టు వారు తెలిపారు.